Saturday, April 12, 2008

ఆత్మీయులు

కొన్ని సంవత్సరాల క్రితం దురదర్సన్ లో ఆత్మీయులు అనే ధారావాహికం వచ్చేది. ఆ ధారావాహిక టైటిల్ సాంగ్ ఇది. వినడానికి ఎంతొ బాగుండేది, రచన ఎవరొ తెలియదు కాని పాడింది బంటి అనుకుంటాను...... ఆపాట మీ కోసం ఇక్కడ చేర్చడమైనది. మీరు ఆనందించంది.


ఎదలోగిలి కదలాడె ఒక రాగం ఒక భావం
మనసెరిగిన భాష ఇది ఒక లాస్యం ఒక భాష్యం
అభిమానం తీరమని
అనుభూతుల సారమని
ఒక గీతం సంగీతం
ఒక మౌనపరాగం ఒక సౌమ్యతరంగం ||2||
చమరించే కన్నులలో
చిరునవ్వులు ఆత్మీయులు ||2|| ||2||
ఎదలోపల తారాడె ఒక గంధం అనుభంధం
కనుపాపల లాలించే ఒక నాధం ఒక వేదం

1 comment:

Sujata M said...

దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాల గురించి చాల చెత్త జోకులు వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు తలచుకుంటే.. ఆ రోజులే బాగుండేవి. హిమ బిందు అనే సీరియల్, రూపా దేవి తో కొన్ని సీరియళ్ళు, ఇంకా నాటకాలు.. ఇప్పుడు ప్రైవేటు చానెళ్ళ స్టాండర్డ్స్ కూడా బాలేవు.. మీ ఈ టపా కొన్ని జ్ఞాపకాల్ని రిఫ్రెష్ చేసింది. చాల థాంక్స్!