Wednesday, November 5, 2008
పునరాగమణం
పునరాగమణం
================
ఆందరికి నమస్కారం.........!! చాలా రోజుల తరువాత, అనేక తర్జన భర్జన ల తర్వతా మళ్ళీ బ్లాగాలని మొదలు పెట్టీ నేను సైతం బ్లాగ్లోకానికి బ్లాగునొక్కట్టి అందించాలని కుతూహళం ఎక్కువై ఏదో ఒకటి వ్రాసేయాలని, వీక్షించిన వాళ్ళందరినీ ఇబ్బందుల్లో పడేయాలని(చదివినా, చదవకపోయినా) నిర్ణయించుకున్నాక, ఒక సుముహుర్తం లో తీరిగ్గా వ్రాద్దామని పంచాంగం మొత్తం వెతికి మాంచి ముహుర్తం పెట్టీ వ్రాయలని కూర్చుంటే ఆలోచనలు స్తంభించినట్లు, అసలు అక్షరాలే రాని నిరక్షర కుక్షిలా తయారైంది నా పరిస్థితి. అదేంటో ఈ బ్లాగులోకం లోని బ్లాగులను చదువుతుంటే వెంటనే నాకు బ్లాగాలనిపించి తీరా బ్లాగడనికి కూర్చుంటే ఏమి బ్లాగాలో, ఎలా బ్లాగాలో (ఎలా మొదలెట్టాలో) దిక్కుతోచని అయోమయ పరిస్థితి లో కలిగిన భావ పరంపరల అక్షర రూపమే ఈ నా పునరాగమణం లోని మొదటిబ్లాగు.
ఇక్కడ బ్లాగోన్మ్హుఖంగా బ్లాగొదరి బ్లాగొదరులకు [సోదర సోదరీమనులకు పేరడి (సోదర/రి అంటే "సహ-ఉదరం" ఒకే ఉదరం పంచుకు పుట్టినవారు అని అర్థం)బ్లాగొదర/రి అంటే బ్లాగును అసరాగా చేసుకొని కలసిన సోదర/రి లన్నమాట]. తెలియజేయునది ఏమనగా మీ విమర్స్యలతోటి (సద్విమర్స్య కాని, దుర్విమర్స్య కాని)నన్ను ప్రోత్సహించి ( ఎవరికైనా తనగురించి ఇతరులు ఏమనుకుంటున్నరో తెలుసు కోవాలనే కుతూహలం వుంటుందటగా, అందులో నేను ఒకడిని) మీ సహాయ సహకారాలను అందించి ఎప్పుడిప్పుడే ఈ బ్లాగులోకంలో అక్షరాల అడుగులను నేర్చుకుంటున్న ఈ పిల్లగాడిని ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ .................మళ్ళీ కలుద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Welcome back
randi,randi,randi dayacheyandi
ప్రతాప్ గారు, లలిత గారు నెనర్లు
ముందు బ్లాగేసి తరువాత బ్లాగులని చదవండి. :) రాయడం ఆపేసినట్టున్నారు. బాగా రాస్తున్నారు. కంటిన్యూ చేయండి.
Post a Comment