Wednesday, November 12, 2008

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఎన్నో వ్రాయాలనీ, నా మనోభావాలను అందరితో పంచుకోవాలనీ బ్లాగడానికి కూర్చుంటే తియ్యటి, కమ్మటీ మధురమైన ( అన్నింటికీ ఆర్థం ఒకటే :)) నా మాతృభాషలో పదాలే కరువైనట్లు, ఆలోచనా ఙ్ఞానం కోల్పోయినట్లు, ఊహలు స్తంభించినట్లు, అడుగు తీసి అడుగువేయలేని మత్తగజం లా ముందుకు సాగనంటోంది. రెప్పలవెనుక తియ్యటి స్వప్నం ఉప్పటి నీరులా ఉప్పోంగుతోందే తప్ప, ఊపిరి లోని మౌన భాష గుండె ఘోషను చెప్పలేకపోతోంది.

వేదనకు గురైన మనసు స్పందిస్తే వేసవిలో మల్లె అవుతుంది, విరక్తి చెందిన మనసు స్పందిస్తే విరిపై మంచు బిందువవుతుంది.మరి ఆనంద పడే మనసు ఆవేదనకు గురైతే ఆ మంచు మరిగి ఆవిరి అవుతుంది. ప్రస్తుతం నా పరిస్తితి అలానే వుంది. చాలా వ్రాయాలని ఆనందంతో వురకలు వేసే మనసును పొదివి పట్టి కూర్చుంటే ఆలోచనలు కరువై ఆవేదనే మిగిలింది.

3 comments:

యామజాల సుధాకర్ said...

నేను బ్లాగులు చదవటమేగాని, ఎప్పుడైనా రాద్దామంటే మటుక్కు మీ లాంటి పరిస్తితే.

మీరు నాకు పదాలు కరువయ్యాయంటూనే మంచి పదాలతో మీ ఆవేదనని వ్యక్తం చేసారు.

Anonymous said...

virisina malle pai padina manchu binduvu ki aavedana agni tagalaneeyakundaa vunte sari :)

aavire kaadu
aa manchu binduvuni teesukelli mee mansane aalchippala badraparchandi
swati mutyam vastundi :):)

edo tochindi raasaaaa
tappulunte sorry


mee psot chaala baagundi

కొత్త పాళీ said...

ఇంకేం, బ్రహ్మాండంగా రాస్తున్నారు :)
కొనసాగింఛండి.