Tuesday, November 18, 2008

ప్రేమంటే ఇదేనా...............!!!

చాలా రోజుల తరువాత ఓ గొప్ప కళా'ఖండా'న్ని తిలకించి పులకించి పోయాను. కళా'ఖండం' పేరు ఉల్లాసంగా.... ఉత్సాహంగా.....! ఇందులో మాటలు ఎవరు వ్రాసారో తెలియదు కాని ఎంత చండాలంగా వున్నాయి అంటే............ నాయకుడు నాయిక తో ఇలా అంటాడు " " నేను స్నేహితులు అనుకున్న వారిని ప్రేమించలేను, నేను ప్రేమించే వారిని స్నేహితులు అనుకోలేను" అని. అంటే స్నేహితులను ప్రేమించలేడు, మరి ద్వేషిస్తాడా??..ద్వేషిస్తే స్నేహితులు ఎలా అవుతారు....?? ప్రేమించేవారితో స్నేహం చేయలేడు......మరి విరోదం పెట్టుకుంటాడా..??? బహుశ అందుకేనేమో జనాలు తాము ప్రేమించిన వారు తమను ప్రేమించడం లేదు అని పది మంది ముందు నిర్దాక్షణ్యం గా చంపిపడేస్తున్నారు. వీరు ఇలాంటి మాటలను విని ఆలాంటివి చేస్తున్నారా...??? లేక రచయితకు ప్రేమంటే తెలియదా???లేక ప్రేమంటే కేవలం సెక్స్ అనుకునే నీచ స్థాయికి దిగజారిపోయాడా???

ప్రేమ!........అపూర్వమైన మధురక్షణాలు.........ప్రకృతికి శోభనిచ్చే అలంకారం...........కాని ప్రేమన్నా, ప్రేమికులన్నా చాలా మందికి చులకన, వాళ్ళేదో తప్పుచేస్తున్నారన్న ముర్ఖపు ఆలోచన.........నిజమే!......దానిక్కారణం లేకపోలేదు. ప్రేమను వంచించే ప్రేమికులు..........ప్రేమనే దైవత్వాన్ని కత్తులతో పొడిచే పెద్దలు.....ప్రేమంటే కేవలం సెక్స్ అనుకొనే నీచులు...........ప్రేమంటే రెండు మనసుల కలయికని తెలియని నికృష్టులు..........ఇంతమంది మధ్య నలిగిపోవడం చేతనే ప్రేమకున్న దైవత్వం మైలపడిపోయింది.

ఇలాంటి డయలాగులు విని నేటియువతకు ప్రేమంటే సరియైన అర్థం తెలిక తప్పు దారిన నడుస్తోంది!.

6 comments:

Unknown said...

రఘురామ్ గారు, బాగా చెప్పారు.

లక్ష్మి said...

Good One Raghuram garu

చైసా said...

" నేను స్నేహితులు అనుకున్న వారిని ప్రేమించలేను, నేను ప్రేమించే వారిని స్నేహితులు అనుకోలేను " బహుశా ప్రేమ అంటే ఆయన ఉద్దేశం లో ఆడ మగ మధ్య అనుకోవాలేమో :) అయిన ఇది త్రివిక్రం ని అనుకరించే ప్రయత్నంలో జరిగింది అని నా అనుమానం.

Ram Krish Reddy Kotla said...

Well said :-)

Anonymous said...

ఆయన వుద్దేశ్యంలో ప్రేమించడం అంటే ఇందిరా పార్క్ టైపేమో?

శిశిర said...

రఘురాం గారు,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.