అపూర్వ ద్వర్థి
భువి నయోధ్య నాగపురికి నధీశుండు
దాశరథి యనంగ ధర్మరాజు.
దాశరథి శ్రీరామచంద్రునికి, ధర్మరాజు యుధిష్ఠిరునికి ఉభయాన్వయం ఇది.
శ్రీ ప్రభాకరాన్వయప్రాతరారాధ్యుఁ
డుత్తముండు వెలయు నుదితయశుఁడుభువి నయోధ్య నాగపురికి నధీశుండు
దాశరథి యనంగ ధర్మరాజు.
దాశరథి శ్రీరామచంద్రునికి, ధర్మరాజు యుధిష్ఠిరునికి ఉభయాన్వయం ఇది.
శ్రీరామచంద్రుని పరంగా అర్థం:
భువిన్ = పుడమి యందు;
అయోధ్య నాఁగన్ = అయోధ్య అను పేరుఁగల;
పురికిన్ = పట్టణమునకు;
అధీశుండు = అధిపతి యగు;
శ్రీ = సర్వసంపత్కరమైన,
ప్రభాకర+అన్వయ = సూర్యవంశమునందు (ప్రభాకరః = రవౌ),
ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతఃకాలమున ఆరాధింపఁదగిన స్వామి;
ఉత్తముండు = శ్రీ మహావిష్ణుస్వరూపుఁడు;
ఉదితయశుఁడు = విశ్రుతమైన కీర్తి గలవాఁడు (యశః = విశ్రుతత్వే);
దాశరథి = దశరథాత్మజుఁ డైన శ్రీరామచంద్రుఁడు;
అనంగన్ = అనఁగా;
ధర్మరాజు = ధర్మస్వరూపుఁ డగు ప్రభువు;
వెలయున్ = ఒప్పారును.

ధర్మరాజు పరంగా అర్థం:
భువిన్ = భూమి యందు;
అయోధ్య నాఁగన్ = శత్రుయోధులకు గెలువ శక్యము గానిది యగు;
నాగపురికిన్ = హస్తినాపురమను పేరుఁగల పట్టణమునకు;
అధీశుండు = అధిపతి యగు;
శ్రీ = సర్వసంపత్కరమైన,
ప్రభాకర+అన్వయ = చంద్రవంశమునందు (ప్రభాకరః = చంద్రే),
ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతర్వంద్యుఁడు;
ఉత్తముండు = సర్వశ్రేష్ఠుఁడు;
ఉదితయశుఁడు = ప్రసిద్ధికెక్కినవాఁడు;
దాశరథి = తనను నిత్యము సేవించు వీరుల మహాసైన్యముఁ గలవాఁడు
(రథ = పౌరుషవంతులైన,
దాశ = సేవక గణము - "రథః స్యన్దనే శరీరే పౌరుషే యోద్ధరి" అని శబ్దార్థకల్పతరువు),
అనంగన్ = అనఁగా;
ధర్మరాజు = ధర్మరాజు అను పేరుఁగల యుధిష్ఠిరుఁడు;

- ఏల్చూరి మురళీధరరావు గారు
No comments:
Post a Comment