Friday, February 22, 2008

మనుషుల స్వభావాలు-2

కొందరు తప్పనిసరి పరిస్థితులలో దిగులుపడతం సహజం. కొందరికి నుదుట బొట్టులా దిగులుంటుంది. ఎప్పుడూ దైన్యంగా కనబడుతున్నట్లు ఉంటారు. వాస్తవానికి వీళ్ళకు దిగులు ఉండదు, దిగులుకే వీళ్ళుంటారు. వారి ముఖం తీరు, ప్రవర్తన తీరు అలాగే వుంటాయి. ఇలాంటి వాళ్ళతో ఐదు నిమిషాలు మాట్లాడితే మనక్కూడా "దిగులు జబ్బు" అంతుకుంటుందనిపిస్తుంది.

తన వీధిలోకి వచ్చిన మరో బలవంతుడ్ని ఆ వీధి గూండా అంగీకరించలేడు. తనకన్నా ఎఫిషియెంటైన పోలీసాఫీసర్ని అతడి బాసే సహించలేడు. అంతెందుకు.....తన పరిధిలో ఆనందంగా బ్రతికే పులి సైతం అక్కడికో కొత్త పులి వస్తే తరిమేయాలనుకుంటుంది. ఉన్నవాడు లేనివాడిని దోచుకొనేది అతడు ఎప్పటికీ లేనివాడుగా మిగలాలనే తప్ప అతడిమీద అంతకు మించి కక్ష వుండదు.

లోకులు ఎదుటివారిలోని ఔన్యత్యాన్ని త్వరగా గుర్తించరు. కాని బలహీనతల్ని మాత్రం వెంటనే భుతద్దం లోంచి చూసి కావుకావుమనే అరుస్తారు. వారికదో ఆనందం. దాని వెనుక ఆత్మవంచన ఉందని వారికి తెలుసు. అయినా ఎదుటివారిని కించపరిస్తే తామేదో గొప్పవారైపోతారన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏనుగు వెళ్తూంటే కుక్కలు మొరగవా? అలా.

మరుసటి టపా లో ప్రేమ గురించి....అంతవరకు సెలవు.

3 comments:

Anonymous said...

చాల మనస్తత్వాలు విశ్లేషిస్తున్నరు. కానివ్వండి, తర్వాతి దాని కోసం ఎదురు చూస్తాం.

రాధిక said...

చాలా బాగా విశ్లేషిస్తున్నారు.మీనుండి మరిన్ని మంచి టపాలు ఆశిస్తున్నాము.మొన్నీ మధ్యనే మిష్టర్ మేధావి సినిమా చూసాను.బాగుంది.ఆ సినిమాలో చెప్పిన అంశాలు మీ టపాలకు కొద్దిగా దగ్గర సంబధం అనిపిస్తుంది.చూడక పోతే చూడండి.ఆ సినిమా మీకు మరిన్నీ ఆలోచనలు కలిగించి మాకు మరిన్ని మంచి టపాలు చదివే భాగ్యం కలిగిస్తుందనుకుంటున్నాను.

Anonymous said...

@kalhara గారు, @రాధిక గారు

సినిమా కథలు ఎక్కడి నుండి వస్తున్నాయండి.... కొన్ని కల్పిత కథలైనా నిజ జీవితం లోని మనుషుల స్వభవాల ఆధారంగా నే కదా వస్తునాయి. మన చుట్టూ వున్న పరిసరాలని నిశితంగా పరిసీలిస్తే మనకే అన్ని స్వానుభవం లోకి వస్తాయి. మీలాంటి వారి ప్రోత్సహం వుంటే తప్పకుండా అందించడానికి ప్రయత్నిస్తాను.