Thursday, February 21, 2008

మనుషుల స్వభావాలు-1

ఇంకోకావిడా పూర్తిగా శాఖాహారులైన తన కోడలి పుట్టింటికి మాంసాహారుడైన తన కొడుకు ను పంపదట. వెళ్లాలనుకుంటే కోడలు ఒంటరిగా వెళ్ళవచ్చట. ఎందుకంటే తన కొడుకుకి మాంసం వండి పెట్టారని. పండుగ రోజు తనే తృప్తిగా వండి పెడుతుందట. ఏం? రొజూ తన కొడుకుకి మాంసం వండి తృప్తి గా పెట్టవచ్చు కదా!! పండుగ రోజే పట్టాలా??. కోడలు తరపువారు మాంసం తినరు అని తెలిసి ఎందుకు తెచ్చుకున్నట్లు వారిచ్చే కట్నం కోసం కాకపొతే??

ఈవిడే ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుంది. ఆరోజు ఆమె చేసే హడవిడి అంతాఇంతా కాదు. ఇంట్లో కుక్క పిల్ల మొదలుకొని ప్రతి ఒక్కటి శుభ్రంగా వుండలి. మిగతా రోజులలో ఈగలు ముసురుతున్నా పట్టించుకోదు. ఒక్కరోజు గుడికి వెళ్ళడానికే ఇంత నిష్ఠ పాటించే ఆమె, చిన్నప్పటినుండి మాంసం అలవాటు లేని తన కోడలు మాత్రం వారు వండి పడేసిన పాత్రలలోనే వండుకు తినాలి. ఎంత దారుణం!, ఎంత స్వార్థం!.

ఇంకొకావిడ తన పక్కింటి పంకజం తో చెబుతోంది..." మా అల్లుడు బంగారు కొండ, మా అమ్మాయి ఎలా చెబితే అలా నడుచుకుంటాడు, ఏది పెడితే అది తింటాడు, తనని చాలా బాగా చుసుకుంటాడు, పెత్తానం అంతా మా అమ్మాయిదే!!, నా కొడుకును చూస్తేనే బాధేస్తుంది. నా కోడలు ఆడించినట్లు ఆడుతాడు, ఆ రాక్షసి వాడిని కొంగుకు ముడేసుకుంది" అని. ఆహా!! కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా??

ఇంకొకామె తన కోడలు తనను ఎంత బాగా చూసుకున్నా, చక్కగా సంసారం చేసుకున్నా ఎదురింటి, పక్కింటి వారి కోడల్లతో పోల్చి లోపాలను ఎత్తి చూపందే తిన్నది జీర్ణం కాదు. మరి అలాంటప్పుడు వారి లాంటి వారినే(వారినే) కొడలుగా తెచ్చుకొని వుండవచ్చు కదా?.

పాపం కొత్త కోడల్లు! తను ఇప్పటి వరకు ఉన్న వాతావరణం నుండి వాతావరణం లోకి వచ్చి వారిథో సర్దుకొని తన జీవనయానాన్ని సాగించే ఎందరో నారిమనులు, అందరికి జోహారులు.

మరికొన్ని మరుసటి టపాలో..........

1 comment:

సూర్యుడు said...

చాలా బాగా చెప్పారు, మీ బ్లాగు టైటిల్ లో అన్నట్లు, ఇవన్నీ మానవ సహజ స్వభావాలు. మనకి ఏది లాభదాయకంగా ఉంటుందో అదే అందరికీ కరెక్ట్ అవ్వాలి :)

రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా, మనం ఏ వాహనంలో వెళ్తున్నామో దాని బట్టి వేరే వాహనాల వాళ్లని విమర్శిస్తూ ఉంటాము ;)

చాలా సహజం.

~సూర్యుడు