Thursday, April 10, 2014

స్త్రీ

స్త్రీ 


తే:-
అతివ కచ నాభి జఘన దేహాననము " త 
మీనదరసాలతారాజపా " నిరాక
రణ మనంతమనాది నేత్ర గళ భుజ న
ఖోష్ఠ కుచ వచో దంతంబు లుభయ గతుల.

భావము:-
1:-
అతివ యొక్క 
-- కచ ----- నాభి ------ జఘన ------ దేహ --------ఆననము లతో
-- తమీ ---- నద ------- రసా---------లతా -------- రాజ.
-- చీకటి. --- సుడి ------ భూమి ------ లత ---------చంద్రుడు. సరి పోలును.
నిరాకరణ మనంత = అంతమందలి "పా" విడిచిపెట్ట వలెను.

2:-
అనాది = ఆది అక్షరమైన "త" విడిచి పెట్టినచో.
---నేత్ర ---- గళ -------- భుజ ------- నఖ ----------ఓష్ఠ ములతో
---మీన----దర---------సాల---------తారా----------జపా
---చేప. --- శంఖము.----ప్రాకారము---నక్షత్రములు.-- మంకెనపువ్వు. 
సరి పోలును.

3:-
కుచ వచో దంతము లుభయ గతులు = ఆద్యంత్యాక్షరములను తొలగించి అనగా ఆద్యక్షరము "త". అంత్యాక్షరము"పా". అను రెండిటినీ విడిచిపెట్టి చూడఁ దగును 

--- కుచ --------------- వచో ------------------------ దంతము లకు 
---మీనద---------------రసాల-----------------------తారా 
---కుంభములు(?)------తీయ మామిడి రసము--------నక్షత్రములు
సరిపోలును.

No comments: