Wednesday, April 9, 2014

రాగ విశేషములు

రాగ విశేషములు - హంశవింశతి


సీ.
భైరవి మాళవి బంగాళ హిందోళ, రాజమంజరియు శ్రీరాగ గౌళ
భూపాళ లెన్మిది పురుషరాగంబులు, దేశాక్షి ఘూర్జరి దేశి తోడి
దేవక్రి యాందోళి దేవగాంధారియు, గౌళ గుండక్రియా హారి సలలి
త బిలహరి కురంజి ధన్యాశి పూర్ణగౌళ వరాళి నాట భల్లాతకి మల


గీ.
హరులు సారంగ రామక్రియలు ననంగఁ, 

గన్నడ యనంగ మంగళకౌశిక యన
వెలయు నారాయణియుఁ జతుర్వింశతి విధ,

ములను దనరారు స్త్రీరాగములను మఱియు.

సీ.
కాంభోజి కేదారగౌళ శోకవరాళి, పున్నాగ గుమ్మకాంభోజి శంక
రాభరణము మేఘరంజి తోడివరాళి, నాదనామక్రియ నాట రీతి
గౌళ రామక్రియ మేళరామక్రియ, గౌళనారాయణగౌళ మధ్య
మావతియు ముఖారిమలహరి సామంత, పంతువరాళియు బాళిరాగ

గీ. 
చెంచుమలహరి దేశాక్షి శ్రీవరాళి, 

మాళవియుఁ బాండిసింధురామక్రియయు వ
సంత సామంత శుద్ధవసంత గుబ్జ, 

రియును హేజిజ్జ్వినీలాంబరియు ననంగ 

గీ.
పొసఁగ ముప్పది రెండు నపుంసకములు, 

మాళవశ్రీయనంగను మలహరి యన
దేవమలహరి రేగుప్తి దిరముకుంద, 
మలహ రన నైదు మిత్ర లీ మర్మ మరసి.

                                                              - హంసవింశతి -అయ్యలరాజు నారాయణామాత్యుడు.

No comments: