Tuesday, March 25, 2014

మామకు మామ ఐనవాడు

మామకు మామ ఐనవాడు 
ఉ.
మామను సంహరించి, యొక మామను గర్వ మడంచి, య న్నిశా
మామను రాజుఁ జేసి, యొక మామ తనూజున కాత్మబంధువై,
మామకుఁ గన్ను లిచ్చి, సుతు మన్మథు నింతికిఁ దానె మామయై,
మామకు మామయైన పరమాత్ముఁడు మీకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము) 
భావం -
మామ అయిన కంసుని సంహరించి, వారధి కట్టడానికి ముందు తన మామ అయినసముద్రుని గర్వాన్ని అణచి, నిశామామ అయిన చంద్రునికి `రాజు` అనే పేరునిచ్చి,మామ కొడుకైన అర్జునునకు ఆప్తుడై, మామ అయినధృతరాష్ట్రునికి కన్నులిచ్చి, కొడుకైనమన్మథుని భార్య రతీదేవికి తానే మామ అయి, తనకు లక్ష్మి నిచ్చిన మామ సముద్రునికితన కూతురైన గంగనిచ్చి అతనికి మామ అయిన విష్ణుదేవుడు మీకు ప్రసన్నుడౌతాడు

No comments: